Prajavani petitions speedy resolution Nirmal Collector Abhilash Abhinav: ప్రజావాణిలో వచ్చిన ప్రతిదారఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని, ప్రజల ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు. ప్రతి ప్రజావాణి దరఖాస్తును పరిశీలించి తక్షణమే పరిష్కరించాలన్నారు. మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న ప్రజల సమస్యలను సంబంధిత శాఖలు సమన్వయంతో పరిష్కరించాలి అని కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణి అనంతరం కలెక్టర్ సమీక్షిస్తూ అధికారులు వరద సమయంలో తీసుకున్న తగు చర్యలను ప్రశంసిస్తూ, ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అదనంగా వరద నష్ట నివేదికలు సిద్ధం చేయడం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచడం, ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక సర్వేను త్వరితగతిన పూర్తి చేయడం, వనమహోత్సవంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేయడం, ప్రభుత్వ బడులను ఎప్పటికప్పుడు పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.