ACB raids: నిర్మల్, ఫిబ్రవరి 25 (మన బలగం): భైంసా ఎక్సైజ్ సీఐ కార్యాలయంపై ఏసీబీ మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో దాడి చేసింది. సుభాష్ గౌడ్ అనే వ్యాపారి వద్ద లంచం తీసుకుంటుండగా ఎక్సైజ్ ఎస్సై నిర్మలతో పాటు కానిస్టేబుల్ సుజాత రెడ్ హ్యాండ్‌గా ఏసీబీకి చిక్కారు. తన కల్లు వ్యాపారం విషయమై వీరు లంచం డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. ఎస్సై నిర్మల లంచం డబ్బులను కానిస్టేబుల్ సుజాత ద్వారా తీసుకుంటుందని ఏసీబీ అధికారులు చెప్తున్నారు. అందులో భాగంగా మంగళవారం సుజాతకు డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది. ఎస్సై నిర్మలతో పాటు కానిస్టేబుల్ సుజాతను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ డీఎస్పీలు రమణమూర్తి, విజయ్ కుమార్, ఇన్స్పెక్టర్ కిరణ్ సామీ దాడి చేసిన వారిలో ఉన్నారు.