Nirmal Collector EGS works for farmers and literacy program
Nirmal Collector EGS works for farmers and literacy program

Nirmal Collector EGS works for farmers and literacy program: రైతులకు ఉపయోగకరమైన పనులు చేపట్టాలి: జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

Nirmal Collector EGS works for farmers and literacy program: నిర్మల్, ఆగస్టు 22 (మన బలగం): జాతీయ ఉపాధి హామీ పథకం (ఈజీఎస్) కింద రైతులకు, కూలీలకు ఉపయోగకరమైన పనులను చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిర్మల్ గ్రామీణ మండలం డ్యాంగాపూర్‌లో నిర్వహించిన పనుల జాతర కార్యక్రమంలో భాగంగా ఈజీఎస్ నిధులతో నిర్మించిన పశువుల పాకను లబ్ధిదారులతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ, జాతీయ ఉపాధి హామీ పనుల్లో రైతులకు ఉపయోగపడే గొర్రెలు, పశువుల పాకలు, పౌల్ట్రీ, పొలంబాటలు వంటి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రతి గ్రామపంచాయతీ స్థాయిలో ప్రజలకు ఉపాధి హామీ పనులపై అవగాహన కల్పించాలని ఆదేశించారు.

జిల్లాలో 100 శాతం అక్షరాస్యత సాధించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు. ప్రతి ఒక్కరికి చదవడం, రాయడం వచ్చేటట్లు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో వలంటీర్లను నియమించి అక్షరాస్యతను పెంపొందించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. అనంతరం 100 రోజుల ఈజీఎస్ పనులు పూర్తిచేసిన కూలీలను ఈ సందర్బంగా కలెక్టర్ సన్మానించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఆర్డీవో రత్న కళ్యాణి, ఎంపీడీవో గజానన్, అధికారులు, ఉపాధి హామీ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *