Gowda United Action Committee: నిర్మల్, మార్చి 20 (మన బలగం): జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జిల్లాగా నామకరణం చేయాలని గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నం నారాయణ గౌడ్ అన్నారు. గురువారం దిలావర్‌పూర్ మండలం బన్సపల్లి గ్రామంలో జనగామ జిల్లాకు పాపన్న గౌడ్ జిల్లాగా నామకరణం చేయాలని డిమాండ్ చేస్తూ కరపత్రాలను విడుదల చేశారు. గౌడ సమన్వయ వేదిక ఆధ్వర్యంలో నిరాహార దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.