Nirmal Medical College
Nirmal Medical College

Nirmal Medical College: నిర్మల్ మెడికల్ కాలేజీలో జాబ్స్

  • పలు పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
  • వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఓరుగంటి శ్రీనివాస్

Nirmal Medical College: నిర్మల్, మార్చి 20 (మన బలగం): జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో వివిధ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఓరుగంటి శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు వైద్య కళాశాలలో టీచింగ్ స్టాఫ్, ఫ్యాకల్టీలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ అనుమతితో వైద్య కళాశాలలో వివిధ విభాగములలోని టీచింగ్ స్టాఫ్ ఫ్యాకల్టీలను కాంట్రాక్టు ప్రాతిపదికన గౌరవ వేతనంతో భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. అర్హులైన వైద్యుల నుంచి ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఈ పోస్టులకు వయస్సు, విద్యా అర్హతలు (ఎంబీబీఎస్,ఎండీ,ఎం.ఎస్/డీఎన్‌బీ) ఉండాలని తెలిపారు. ఇతర పూర్తి వివరాలకు www.gmc.nirmal.com వెబ్‌సైట్‌లో పొందుపరిచి ఉన్నాయని, అర్హులైన వైద్య అభ్యర్థులు 25.03.25(మంగళవారం) ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మల్ నందు వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు తెలిపారు. అర్హత గల వైద్య అభ్యర్థులు తమ ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *