Veeranari Chakali Ailamma Telangana armed struggle inspiration: భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాటం చేసిన వీర నారి చాకలి ఐలమ్మ అని ఎస్‌హెచ్‌పీఎస్ జాతీయ చైర్మన్ బొమ్మెర బోయిన కేశవులు అన్నారు. సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలోని చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా విగ్రహానికి సమాచార హక్కు పరిరక్షణ సమితి మరియు ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం డాక్టర్ కేశవులు మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం ఆమె చేసిన పోరాటం తెలంగాణ సాయుధ పోరాటానికి స్ఫూర్తినిచ్చి నాంది పలికిన వీరనారి కొనియాడారు. కార్యక్రమంలో చిత్రం నరేశ్, బాలరాజు, యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.