Oil palm factory: నిర్మల్, మార్చి 10 (మన బలగం): నిర్మల్ జిల్లా సోన్ మండలం పాక్ పట్ల గ్రామంలో శంకుస్థాపన చేసిన ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీని త్వరగా ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి రైతు ధర్నా నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటును స్థానిక ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. వెంటనే ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ప్రారంభించి రైతులను ఆదుకోవాలన్నారు. కలెక్టర్‌కు మెమోరాండం ఇచ్చారు. పెద్ద ఎత్తున రైతులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.