Vishwakarma Mahasabha: నిర్మల్, డిసెంబర్ 18 (మన బలగం): నిర్మల్ జిల్లా విశ్వకర్మ మహాసభ అధ్యక్షులుగా వన్నెపన్ని శివకుమార్‌ను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షులు కౌలే జగన్నాథచారి ఉత్తర్వులు జారీచేశారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ తనను నిర్మల్ జిల్లా అధ్యక్షులుగా నియమించిన రాష్ట్ర బాద్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లాలోని విశ్వకర్మలందరినీ ఏకతాటిపై తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు. విశ్వకర్మలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని, వారి అభివృద్ధికి పాటుపడుతానని తెలిపారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో తిరిగి ఆయా వృత్తిలో పనిచేస్తున్న కుల సోదరులను ఐక్యం చేస్తానని అన్నారు. సమావేశంలో విశ్వకర్మ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అవాంఛి మురళి, నాయకులు సతీశ్ చారి, శ్రీనివాస్ చారి, భాస్కర్ చారి, తదితరులు హాజరయ్యారు.