Financial assistance: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 6 (మన బలగం): రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న రాజేశ్వరి ఇల్లు సిలిండర్ పేలి పూర్తిగా కాలిపోయింది. విషయం తెలుసుకున్న కోడూరు వైష్ణవి తన తల్లి సహాయంతో రూ.4,500 సేకరించిన మొత్తం డబ్బులను ఉపాధ్యాయుల సమక్షంలో అందించింది. వైష్ణవిని ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు. విద్యార్థులు చిన్నతనం నుంచే తోటి వారికి సాయం చేయడం అలవర్చుకోవాలని, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని ప్రధానోపాధ్యాయులు అన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు లకావత్ మోతిలాల్, స్టాఫ్ సెక్రటరీ మల్లేశం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.