Collector Sandeep Kumar Jha: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 8 (మన బలగం): మహిళా సంఘాల ద్వారా ఎరువులు విత్తనాల షాప్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మహిళా సంఘాల ద్వారా ఎరువులు, విత్తనాల డీలర్‌షిప్ దుకాణాల ఏర్పాటుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, జిల్లాలోని మహిళా సంఘాలలో అర్హులైన వారిని గుర్తించి వారిచే ఎరువులు విత్తనాల షాప్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అన్నారు. ఎరువులు విత్తనాల షాపులు నడిపే వారికి బీఎస్సీ అగ్రికల్చర్ డీగ్రి లేదా డిప్లమా, స్వంత గోడౌన్ లేదా అద్దెకు తీసుకున్న గోడౌన్ , ఎరువులు, విత్తనాల లైసెన్స్ సర్టిఫికెట్ అవసరం ఉంటుందని అన్నారు. మహిళా సంఘాలకు ఎరువులు, విత్తనాల డీలర్ షిప్, షాపుల ఏర్పాటు అవసరమైన లైసెన్స్ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. మహిళా సంఘం పూర్తి వివరాలు తీసుకుని ఎరువులు, విత్తనాల షాప్ ఏర్పాటు లైసెన్స్ కోసం మండల వ్యవసాయ అధికారిని సంప్రదించాలని అన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రతి మండలంలో 2 ఎరువులు, విత్తనాల షాపులు మహిళా సంఘాల ద్వారా ఏర్పాటయ్యేలా కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ సూచించారు. ఎరువులు, విత్తనాల షాప్ ఏర్పాటుకు అవసరమైన గోదాంతో కూడిన భవనాల అద్దె స్వీకరించాలని అన్నారు. మహిళా సంఘాల్లో బీఎస్సీ అగ్రికల్చర్ డిగ్రీ లేదా డిప్లమా సర్టిఫికెట్ ఉన్న మహిళలు ఎరువులు విత్తనాల షాప్ ఏర్పాటుకు ముందుకు వస్తే వారికి అవసరమైన లైసెన్స్ సర్టిఫికెట్ వ్యవసాయ శాఖ అధికారులు అందిస్తారని కలెక్టర్ తెలిపారు. రాబోయే పంట సీజన్ ముందు ఈ షాప్ ల ఏర్పాటు చేస్తే ఎరువుల కేటాయింపు జరుగుతుందని అన్నారు. ఈ – పాస్ యంత్రాల ద్వారా ఎరువుల విక్రయం గురించి శిక్షణ అందించడం జరుగుతుందని అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో డిఆర్డిఓ శేషాద్రి, డిఏఓ అఫ్జలి బేగం, అడిషనల్ డిఆర్డిఓ శ్రీనివాస్, వివిధ మండలాల ఏ.పీ.ఎం.లు తదితరులు పాల్గొన్నారు.