road accident: ధర్మపురి, జనవరి 6 (మన బలగం): జగిత్యాల జిల్లాలోని ఎండపల్లి మండలం గుళ్లకోట గ్రామంలో ఐకేపీ వద్ద గురువారం ఘోరం రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్, బైక్ ఢీకొని ఒకరు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మృతుడి తల, మొండెం రెండు వేరయ్యాయి. ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి ఎండపల్లి గ్రామానికి చెందిన చీకటి వెంకటేశ్ (45)గా స్థానికులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది పోలీసులు తెలిపారు.