DEO Darshanam Bhojanna takes charge Nirmal district education: నిర్మల్ జిల్లా నూతన విద్యాధికారిగా నియమితులైన దర్శనం భోజన్న మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్‌ను, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫయాజ్ అహ్మద్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సంద్భంగా కలెక్టర్ కృషి చేయాలని సూచించారు. విద్యార్థులకు రాష్ర్ట ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందేలా చూడాలని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటుకు దీటుగా నిలపాలని సూచించారు. కార్యక్రమంలో డీఈవో వెంట జిల్లా పరీక్షల సహాయ కమిషనర్ ముడారపు పరమేశ్వర్, సూపరింటెండెంట్ రమణ, డీసీఈబీ ఇన్‌చార్జి భానుమూర్తి, ఎస్‌వోలు లింబాద్రి, రాజేశ్వర్, ప్రవీణ్ కుమార్ తదితరులు ఉన్నారు.
