Gangaputras save buffaloes Godavari flood Nirmal: భారీ వర్షాలకు గోదావరి ఉప్పొంగడంతో గోదావరి మధ్యలోని కుర్రులో చిక్కుకున్న 300 బర్రెలను రక్షించిన గంగపుత్రులను ఘనంగా సన్మానించారు. నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం మునిపెల్లి, మాచాపూర్ గ్రామాలకు చెందిన 300 బర్రెలు గోదావరి మధ్యలోనే చిక్కుకుపోయాయి. వారం రోజులపాటు గోదావరి మధ్యలోని కుర్రులోనే ఉండిపోయాయి. గోదావరి శాంతించడంతో సోమవారం బర్రెలను గోదావరి దాటించిన గంగపుత్రులను ఆయా గ్రామాలవాసులు ఘనంగా సన్మానించారు. బొడ్డు సాయన్న (చెర్మన్), బొడ్డు సాయన్న, బొడ్డు ఆశన్న, బొడ్డు చిన్న సాయన్న (మైరం), పల్లికొండ శ్రీనివాస్ కుర్రు నుంచి బర్లను దాటించిన గంగపుత్రులకు గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.