గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతి
Gangaputra Sangham demands halt to illegal construction at Boddoni Kunta in Khanapur: నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని శాంతినగర్ కాలనీలో ఉన్నటువంటి బొడ్డోనికుంటలో అక్రమంగా జరుగుతున్న నిర్మాణం పనులు వెంటనే నిలిపివేయాలని గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్‌కు, అడిషన్ కలెక్టర్‌కు నిర్మల్ గ్రీవెన్స్‌లో సోమవారం వినతిపత్రం సమర్పించారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఏఫ్టీఎల్ పరిధిలో ఉన్న బొడ్డోనికుంటలో భవనం నిర్మాణం చేస్తే భవిష్యత్‌లో ముప్పు ఉంటుందని, ఈ కుంట ఆధారణంగా కొన్ని కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని ఆవేదన చెందారు. ఈ నిర్మాణం పనులను వెంటనే ఆపివేసి, దానికి కారణమైన వారిపై చర్యలు తీసుకొని కుంట భవిష్యత్‌లో ఎలాంటి కబ్జాలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు పర్మి సురేశ్, పర్మి రమేశ్, బీమన్న, గడ్డమీది రవి, గడ్డి రమేశ్, గణేశ్, గంగాధర్, కిషన్, బాలు, సురేశ్, లక్ష్మణ్, లక్ష్మీనారాయణ, నర్సయ్య, భీమ్ రాజం, సంఘం సభ్యులు పాల్గొన్నారు.
