Excise Enforcement: నిర్మల్, నవంబర్ 29 (మన బలగం): నిర్మల్ పట్టణంలో స్టేట్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులు జరిగాయి. నిర్మల్ బైపాస్ రోడ్‌లోని దాబా హోటల్ నిర్వహిస్తున్న ఓ వ్యక్తి ఇంట్లో(వైష్ణవి అపార్ట్మెంట్ బీ బ్లాక్)లో ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులు నిర్వహించారు. ఇల్లీగల్ మద్యం విక్రయాలను కొనసాగిస్తున్నాడని సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. సదరు దాబా యజమానికి సంబంధించిన ఇళ్లలో, హోటల్లో, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో దాడులను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. అపార్ట్‌మెంట్‌లోని సీసీ కెమెరాల ఫుటేజీని అధికారులు పరిశీలిస్తున్నారు.