Committee: ఇబ్రహీంపట్నం, మార్చి 17 (మన బలగం): జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయ నూతన కార్యవర్గాన్ని ఆలయ వ్యవస్థాపకులు కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు సోమవారం 29వ వార్షిక ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. కార్యనిర్వాహణ కమిటీ అధ్యక్షులుగా గంగుల వివేక్, అధ్యక్షులుగా దొమ్మటి ప్రవీణ్ కుమార్, ఉపాధ్యక్షులుగా అంకతి భరత్ కుమార్, కార్యదర్శిగా ఉజ్జగిరి శ్రీనివాస్, సహాయ కార్యదర్శిగా చిలమంతుల శివ, కోశాధికారిగా బండారి మారుతి, కార్యవర్గ సభ్యులుగా బురా ప్రసాద్ గౌడ్, అవుట్ల లక్ష్మణ్, వాల్గోటు నరేష్, శివ శ్రీనివాస్, నత్తి నర్సయ్య, చేపూరి రాము, ద్యావనపల్లి గణేష్, నారోజు కిరణ్, చెట్లపల్లి దేవేందర్ గౌడ్, మణిదీప్, పుల్ల చిన్నా గౌడ్, బి.శరత్ రావులతో పాటు ప్రత్యేక ఆహ్వానితులు మంత్రి అంజయ్య గురుస్వామి, కోట బుచ్చి గంగాధర్, కూన గోవర్ధన్, కొమిరెడ్డి తిరుపతిరెడ్డి, మహాజన్ నరసింహులను కమిటీలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కోసం కమిటీ అహర్నిశలు కృషి చేస్తూ భక్తులకు ఎలాంటి ఇక్కట్లు కలగకుండా చూసుకోవాలని పేర్కొన్నారు.