- మున్సిపల్ ఆదాయానికి గండి
- బాధ్యులపై చర్యలకు ప్రజావాణిలో ఫిర్యాదు
Illegal construction: జగిత్యాల ప్రతినిధి, మార్చి 17 (మన బలగం): గత పది ఏండ్ల క్రితమే మున్సిపల్ అనుమతులు లేకుండానే మూడు అంతస్తుల భవనం నిర్మించారని, అప్పటి నుంచి మున్సిపల్ ఆదాయానికి గండి కొట్టిన దీనికి ఈ నెల మార్చి 1న కొత్తగా నిర్మాణం కోసం అనుమతులు తెచ్చుకొని సక్రమ నిర్మాణంగా మార్చే ప్రయత్నం చేస్తున్న వీరిపై చర్యలు తీసుకోవాలని చిగుర్ల భగవాన్ రాజ్ అనే యువకుడు జిల్లా కలెక్టర్‌కు సోమవారం ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదులో కోరారు. ధర్మపురి రోడ్డులో 1వార్డులో సర్వే నెం62లో ఏనుగుల రాజమల్లయ్య అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు మునిసిపల్ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే 10 సంవత్సరాల క్రితమే మూడు అంతస్తుల భవనాన్ని ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండానే నిర్మించారని పేర్కొన్నారు. అప్పటికే రోడ్డును కొద్దిమెర ఆక్రమించి నిర్మాణం చేపట్టాడని పేర్కొన్నారు. ఆనాటి నుంచి ఈ మూడు అంతస్తులో కుటుంబాలు, దుకాణాలు నడుస్తున్నాయని, ఇదివరకే నిర్మించి ఉన్న భవనానికి ఈ నెల మార్చి 1న నూతన భవన నిర్మాణ అనుమతులను జగిత్యాల మున్సిపల్ ఇచ్చిందని పేర్కొన్నారు.
పదేండ్లుగా కొత్త ఇంటి నిర్మాణంపై మున్సిపల్ ఇంటిపన్ను చెల్లించకుండా ఇప్పటికి పాత ఇంటి పన్నును చెల్లీస్తూ మున్సిపల్ ఆదాయానికి గండి కొట్టారని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని మోసం చేసి, రోడ్డును ఆక్రమించిన రాజమల్లయ్య పై అవినీతి కి పాల్పడిన మున్సిపల్ అధికారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని భగవాన్ రాజ్ కలెక్టర్ ను కోరారు. అలాగే ఈ అక్రమ నిర్మాణం లో ముందున్న షటర్ లను పిల్లర్లతో కాకుండా నిర్మాణం చేశాడని అనుకోని ప్రమాదం జరిగితే పక్కనే ఉన్న మా ఇంటికి ముప్పు వాటిల్లి ఇంట్లోని మా కుటుంబ సభ్యుల ప్రాణాలకు ప్రమాదం గా ఉందని తక్షణమే చర్యలు తీసుకోవాలని భగవాన్ రాజ్ ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ కు ఇచ్చిన ఫిర్యాదు లో కోరగా జిల్లా కలెక్టర్ ను కోరగా సంబంధిత అధికారులుపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని, అధికారులను అవినీతికి ప్రేరేపించి త్రప్పుదోవ పట్టించిన ఏనుగుల రాజమల్లయ్యపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ అదేశించారని భగవాన్ రాజ్ తెలిపారు.