Replacement of old electric poles in Khanapur Sriram Nagar: నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని శ్రీరామ్ నగర్‌లో గల నాలుగో వార్డ్ పరిధిలో బుధవారం తుప్పుపట్టిన పాత ఇనుప స్తంభాలను విద్యుత్ సిబ్బంది తొలగించారు. 60 సంవత్సరాల క్రితం వేసిన ఇనుప స్తంభాలు తుప్పు పట్టి ప్రమాదకరంగా మారాయి. నాలుగో వార్డ్ మాజీ కౌన్సిలర్ నాయిని స్రవంతి సంతోష్ పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులకు ఇనుప స్తంభాలు తిలగించాలని ఫిర్యాదు చేశారు. దీనితో విద్యుత్ శాఖ అధికారులు స్పందించి ఇనుప స్తంభాల స్థానంలో సిమెంట్ స్తంభాలను వేయడం జరిగిందని కౌన్సిలర్ స్రవంతి సంతోష్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యుత్ ఏఈ రాంసింగ్, సిబ్బందికి కాలనీవాసులు అభినందనలు తెలియజేసారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ నాయిని స్రవంతి, సంతోష్, కట్ట రాజలింగం, కరిపే రవి, లాండేరి చందు, కాలేరి కన్నయ్య, లైన్మెన్ నయీమ్, కాంట్రాక్టర్ ఖాజాఖాన్, కాలనీ వాసులు విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.