Essay competitions by Sathya Sai Seva Samithi in Khanapur schools
Essay competitions by Sathya Sai Seva Samithi in Khanapur schools

Essay competitions by Sathya Sai Seva Samithi in Khanapur schools: సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు

Essay competitions by Sathya Sai Seva Samithi in Khanapur schools: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్ ప్రభుత్వ పాఠశాలలో బుధవారం సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యసాయి సేవా సంస్థల కార్యవర్గ సభ్యులు చింతపండు సత్తయ్య మాట్లాడుతూ, మండలంలోని పలు ఉన్నత పాఠశాలల్లో మానవుని పరిపూర్ణ జీవనంలో కృతజ్ఞత పాత్ర అనే అంశంపై వ్యాసరచన పోటీలను మస్కాపూర్ ఉన్నత పాఠశాలలో ప్రారంభించిటం జరిగిందని, ప్రతి ప్రాణి తాను బతుకాలంటే ప్రకృతిలోని మరో జీవిపై తప్పనిసరిగా ఆధారపడితేనే మనుగడ సాగిస్తుందని అన్నారు. ఈ విధమైన పరస్పర సహకారం కోసం కృతజ్ఞతను కలిగి ఉండాలని, అన్ని ప్రాణుల్లో కెల్లా మానవుని జన్మ ఉత్తమమైనదని, సాటి ప్రాణి పట్ల కరుణ, దయార్ద హృదయం కలిగి ఉండాలని పేర్కొన్నారు. అనంతరం ఖానాపూర్, సుర్జాపూర్, ఖానాపూర్ ఆశ్రమ బాలికల పాఠశాల, మస్కాపూర్ కేజీబీవీ, సత్తెనపల్లి, బీర్నంది ఉన్నత పాఠశాలల్లో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంఈవో సంధ్యారాణి, ప్రధానోపాధ్యాయులు బోనగిరి నరేందర్ రావు, మునీందర్, జీఎల్వీ జీఎల్వీ ప్రసాద్, కుర్ర శేఖర్, వెన్నం అంజయ్య, వినోద్రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *