- సర్పంచ్, ఉప సర్పంచ్, కార్యదర్శి కమ్మక్కు
- కాంట్రాక్టర్‌కు తెలియకుండా శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు బిల్లు డ్రా
- కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన బాధిత కాంట్రాక్టర్
Malyala Gorregundam village fraud contractor bills: మల్యాల, ఆగస్టు 30 (మన బలగం): మల్యాల మండలంలోని గొర్రెగుండం గ్రామ గత పాలకవర్గం భారీ మోసానికి పాల్పడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాంట్రాక్టర్ శ్మశానవాటిక, డంపింగ్ యార్డ్ పనులు చేయగా అందుకు సంబంధించిన డబ్బులు దర్జాగా డ్రా చేసుకున్నారు. దీంతో కాంట్రాక్టర్ లబోదిబో మంటూ కలెక్టర్‌ను ఆశ్రయించాడు. గుర్రం శేఖర్ గౌడ్ గ్రామంలో శ్మశానవాటిక, డంపింగ్ యార్డ్ పనులు 2022లో పూర్తి చేశాడు. పనులకు సంబంధించిన బిల్లలు ఆయనకు తెలియకుండా మాజీ సర్పంచ్, ఉప సర్పంచ్, కార్యదర్శి, కరోబారి మిర్యల సరిత మూడేళ్ల క్రితమే డబ్బులు డ్రా చేసికున్నారు. ఈ విషయం తెలియక కాంట్రాక్టర్ ఇన్ని రోజులు బిల్లుల కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేశారు. చివరకు విషయం తెలియడంతో జిల్లా కలెక్టర్‌తోపాటు మల్యాల సబ్ ఇన్‌స్పెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తాను చేసిన పనులకు సంబంధించి రూ.5,30000 డ్రా చేసుకొని వాడుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.