Nirmal floods inspection Collector Abhilash Abhinav
Nirmal floods inspection Collector Abhilash Abhinav

Nirmal floods inspection Collector Abhilash Abhinav: త్వరితగతిన వరద నష్టం నివారణ చర్యలు: నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్

Nirmal floods inspection Collector Abhilash Abhinav: నిర్మల్, ఆగస్టు 30 (మన బలగం): జిల్లాలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ఏర్పడిన వరద నష్టాలపై జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శనివారం సోన్ మండలంలో పర్యటించారు. ఇటీవల వర్షాల కారణంగా ప్రభావితమైన ప్రదేశాలను పరిశీలించిన కలెక్టర్, ప్రజలు, రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భారీ వర్షాల వలన జరిగిన నష్టాలను అధికారులు ఇప్పటికే నష్ట నివారణ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారని తెలిపారు. పంట నష్టం ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపి సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పశుకాపరులు, చేపలు పట్టేవారు జాగ్రత్తగా ఉండాలని, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెంబరు 9100577132ను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్శనలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, తహసీల్దార్ మల్లేశ్, రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *