MP Aravind: ఇబ్రహీంపట్నం, నవంబర్ 3 (మన బలగం): జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వేములకుర్తి గ్రామ గోదావరి నదిపైన 1959లో నిర్మించిన గంగనాల ఆయకట్టు కాలువకు ప్రత్యేక తుము ఏర్పాటు చేయాలని వేములకుర్తి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురిని ఆదివారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఇబ్రహీంపట్నం మండలంలోని వేములకుర్తి, యామపూర్, ఫకిర్ కొండాపూర్, మల్లాపూర్ మండలంలోని నడికుట, మెగిలిపెట్, ఓబులాపూర్, సంఘెం శ్రీరాంపూర్, దామరాస్‌పెల్లి, వాల్గోండ గ్రామాల్లోని 3 వేల ఎకరాలకు సాగు నీరు అందుతోంది. ఎగువన నిర్మల్ జిల్లా పొన్‌కల్-జగిత్యాల జిల్లా ములరాంపుర్ గ్రామాల మధ్య 55 గేట్లతో సదర్‌మాట్ బ్యారేజ్ నిర్మణంతో గంగనాలకు వచ్చే పాయలో సదర్‌మాట్ బ్యారేజ్ నిర్మాణంలో సంబంధిత కాంట్రాక్టర్ రాళ్లు వేయడంతో సాగునీటికి తీవ్ర ఇబ్బందులు అవుతున్నయన్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడి తూము ఏర్పాటు చేయాలని కోరారు. ఎంపీని కలిసిన వారిలో బీజేపీ నాయకులు గుజ్జే గంగాధర్, అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎడిపెల్లి గంగారెడ్డి, ఉపాధ్యక్షుడు గోడీల భూమేశ్ గౌడ్, కోశాధికారి పుప్పాల నరేందర్, రాపర్తి దేవేందర్, కమిటీ సభ్యులు అంకతి రాజన్న, ఎస్కిల శ్రీనివాస్, నూనె సంతోష్, రాధారపు లింగం, గుడ్ల రాజేందర్, పల్లి పెద్దులు, మెగిలి స్వామి దాస్, తరి రాజ్ కుమార్, పట్నం లక్ష్మణ్, అక్కపెల్లి గోపాల్, గాంధారి శ్రీకాంత్, అల్లకుంట లస్మయ్య తదితరులు పాల్గొన్నారు.