Three arrested for transporting ganja: జగిత్యాల, నవంబర్ 3 (మన బలగం): యువతను మత్తులో చిత్తు చేసి ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించాలన్న ఆలోచనతో గంజాయిని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకొన్నట్లు టౌన్ సీఐ వేణుగోపాల్ తెలిపారు. ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో జగిత్యాల రాజీవ్ బైపాస్ మీదుగా ముగ్గురు వ్యక్తులు స్కూటీపై గంజాయి తరలిస్తున్నట్లు అందిన పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. జక్కుల మధు, రాచర్ల వంశీ, నలిమెల మధు నుంచి స్కూటీని, గంజాయిని స్వాధీనం చేసుకొన్నారు. అనంతరం న్యాయమూర్తి ముందు హాజరు పర్చగా జైలుకు తరలించినట్లు సీఐ వేణుగోపాల్ పేర్కొన్నారు.