Government for the lower classes: అట్టడుగు వర్గాలకు అండగా ప్రభుత్వం

Government Whip Laxman Kumar
Government Whip Laxman Kumar
  • ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
  • ఇంటింటి సర్వేపై కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి సమావేశం

Government for the lower classes: ధర్మపురి, నవంబర్ 3 (మన బలగం): కాంగ్రెస్ ప్రభుత్వం అట్టడుగు వర్గాలకు అండగా ఉంటుందని ప్రభుత్వ విప్, ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. ఇంటింటి కుటుంబ సర్వేపై ఆదివారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎంత మంది పేదవారు ఉన్నారు, అర్హులైన ఎంత మంది పేదవారికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి వంటి అంశాలపై స్పష్టమైన సమాచారం కోసం రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిస్తోందన్నారు. కుటుంబ సర్వే ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని, అధికారులు నేరుగా ఇంటి ఇంటికి వచ్చి కుటుంబానికి సంబంధించిన వివరాలను సేకరిస్తారని తెలిపారు.

ప్రతి ఒక్కరూ అధికారులకు సహకరించి ఖచ్చితమైన వివరాలను ఇవ్వాలని కోరారు. దీంతో భవిష్యత్తులో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హత పొందే అవకాశం ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదవారికి, అట్టడుగువర్గాల వారికి అండగా ఉంటుందన్న సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మనం కష్టపడాలని, ప్రతి కార్యకర్త కష్టసుఖాల్లో వారికి తోడుగా తాము ఉంటామని ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం రాష్ట్రంలో విద్యార్థులకు కాస్మొటిక్, మెస్‌చార్జీలు పెంచిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *