Play ground under the flyover: ఇది ఎంతో అద్భుతమైన ఆలోచన. ఫ్లైఓవర్ కింద ఉన్న ఖాళీ స్థలాన్ని ఆట స్థలంగా మార్చేస్తున్నారు. ఆకట్టుకునేలా కలర్ పెయింటింగ్స్‌తో అందంగా తీర్చిదిద్దుతున్నారు. కలర్‌ఫుల్‌గా కనువిందు చేస్తూ మనసుకు ఆకట్టుకుంటోంది. ఉన్న కొద్ది పాటి స్పేస్‌లోనే అత్యంత సుందరమైన ప్లేగ్రౌండ్ రూపుదిద్దుకుంటోంది. ఫ్లైఓవర్ పిల్లర్లపై పలు క్రీడలకు సంబంధించిన చిత్రాలు ఆటల పట్ల ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. ఫ్లైఓవర్ కింద ప్లే గ్రౌండ్ చిన్నారులను కచ్చితంగా ఆకట్టుకుంటుంది. హైదరాబాద్ జెన్టీయూ ఫ్లైఓవర్ కింద ఏర్పాటు చేస్తున్న ఆట స్థలంలో ప్రస్తుతం పెయింటింగ్ పనులు కొనసాగుతున్నాయి. త్వరలోనే అందుబాటులోకి రానుంది.