Bathukamma celebrations in school Khanaapur: నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని విశ్వశాంతి గురుకుల విద్యాలయంలో ముందస్తు బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పాఠశాలలో ఉదయమే వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరణ చేసి పూజలు చేశారు. విద్యార్థినులు అంత ఒక చోట చేరి ఆట ఆడుతూ, పాటలు పాడుతూ అలరించారు. కరస్పాండెంట్ గాడ్పాలే సుభాష్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు కన్నుల పండువగా నిర్వహించారు. తెలంగాణలో అత్యంత ప్రాముఖ్యత, సంప్రదాయానికి నిదర్శనంగా నిలిచేది బతుకమ్మ అని కొనియాడారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
