Members of Andal Goshti: నిర్మల్, డిసెంబర్ 29 (మన బలగం): ఎదులాబాద్ గోదా దేవి ఆలయాన్ని నిర్మల్ దేవరకోట ఆండాళ్ గోష్టి సభ్యులు ఆదివారం సందర్శించారు. ధనుర్మాసం సందర్భంగా అమ్మవారికి నిర్మల్ దేవరకోట ఆలయం తరఫున చీర సారే పుష్పాలను సమర్పించారు. నిర్మల్ ప్రాంతం ఆధ్యాత్మికంగా, సామాజికంగా, రాజకీయంగా విద్య, వ్యవసాయం, తదితర అన్ని రంగాల్లో మరింత పరిపక్వం కావాలని స్వయంభువుగా వెలసిన అమ్మవారిని వేడుకున్నారు. ఆలయ చైర్మన్ కొండా శ్రీనివాస్, వేదపండితులు రామకన్నన్ భక్తులకు సదుపాయాలను కల్పించారు. పరమ ఆనందమైన విషయాన్ని ఏకాంతంగా, ఒంటరిగా అనుభవించడం కాకుండా అందరితో కూడి అనుభవించాలని అమ్మ తిరుప్పావైలో చెప్పినట్లు అందరం కలిసి క్షేత్రాన్ని సందర్శించామని తెలిపారు. లోకకళ్యాణం కోసమే ఈ మాసంలో తిరుప్పావై వ్రతం ఆచరించడం జరుగుతుందని వివరించారు. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, గోదా అష్టోత్తరాలను సామూహికంగా పారాయణం చేశారు. ఆలయ ఆర్చకుల ద్వారా ఎదులాబాద్ గోదాదేవి ఆలయ వైభవాన్ని తెలుసుకున్నారు. వట్టిమల్ల ప్రభాకర్, శేఖర్, వాణి, రమాదేవి, విజయ, గీత శుభశ్రీ తదితరులు ఉన్నారు.