BJLP leader Eleti Maheshwar Reddy
BJLP leader Eleti Maheshwar Reddy

BJLP leader Eleti Maheshwar Reddy: పసుపు బోర్డు ఏర్పాటుపై సంబురాలు: ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం

రైతు పక్షపాతి ప్రధాని : బీజేఎల్‌పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
BJLP leader Eleti Maheshwar Reddy: నిర్మల్, జనవరి 16 (మన బలగం): రైతుల పక్షపాతి ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డును ఏర్పాటు చేశారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంగా కేంద్రీయ పసుపు బోర్డు ఏర్పాటుపై మహేశ్వర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని కొనియాడారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మోడీ చిత్రపటానికి గురువారం పాలాభిషేకం చేసారు. ఈ బోర్డు ఏర్పాటుతో రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని, రైతులు ఇకపై ఈ బోర్డును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బోర్డు ఏర్పాటులో రైతుల కృషితో పాటు ఎంపీ ధర్మపురి అరవింద్ కృషి కూడా ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, నాయకులు రావుల రాంనాథ్, మెడిసెమ్మ రాజు, తక్కల రమణ రెడ్డి, ముత్యం రెడ్డి, మండల అధ్యక్షులు మార గంగా రెడ్డి, వెంకట్ రెడ్డి, నాయకులు వీరెశ్, విలాస్, పోతన్న, వొడిసెల అర్జున్, అర్జున్, సాహెబ్ రావ్, శ్రవణ్, రాజేశ్వర్ రెడ్డి, చంద్రకాంత్, తిరుమల చారి, జుట్టు దినేశ్, విజయ్, కార్తీక్, సుంకరి సాయి, కొండాజీ శ్రావణ్, ఎల్లయ్య, లక్ష్మా రెడ్డి, తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *