BJP Nirmal: నిర్మల్, డిసెంబర్ 29 (మన బలగం): గడపగడపకు భారతీయ జనతా పార్టీని తీసుకు వెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పార్టీ సంస్థాగత ఎన్నికల ఇన్చార్జ్ ప్రేమేందర్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అంజు కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ సంస్థాగత జిల్లా ఇన్‌చార్జి ఎన్నికల అధికారి ప్రేమెందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఇంటికి బీజేపీని తీసుకువెళ్లాలని పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయాలని, ప్రతి ఒక్క వృత్తుల వారికి, వ్యాపారస్తులకు, కూలీలకు, బీడీ కార్మికులకు అన్ని వర్గాల ప్రతి ఒకరిని పార్టీలో భాగస్వామ్యం చేయాలని సూచించారు. మండల సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని, అనంతరం జిల్లా ఎన్నికల నిర్వహించుకోవాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రావుల రామ్‌నాథ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవి పాండే, క్రియాశీల సభ్యత్వం జిల్లా కోఆర్డినేటర్ రాచకొండ సాగర్ మండల అధ్యక్షులు, మండల అబ్జర్వర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు.