Telangana activist dies: తానూర్, డిసెంబర్ 29 (మన బలగం): తానూర్ మండలం భోసీ గ్రామానికి చెందిన భామన్ రాఘవులు (72) అనారోగ్యంతో శనివారం మృతి చెందారు. పలువురు తెలంగాణ జాయింట్ యక్షన్ కమిటీ నాయకులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం ఆయన చేసిన కృషిని కొనియాడారు. 2010 జనవరి 11న మొట్టమొదటగా భోసీలో ఆయన 5 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టినట్లు గ్రామస్థులు తెలిపారు. రాఘవులు మరణం తీరని లోటని పేర్కొన్నారు.