Whip Laxman: ధర్మపురి, డిసెంబర్ 29 (మన బలగం): జగిత్యాల జిల్లా కేంద్రంలోనీ ఎస్‌వీఎల్ఆర్ గార్డెన్స్‌లో తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రోజున ఏర్పాటు చేసిన క్యాలండర్ ఆవిష్కణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ 2025 నూతన సంవత్సరాది క్యాలెండర్‌ను ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇటీవల జిల్లాకు చెందిన పలు ఉపాధ్యాయ సంఘాల వారు తనను కలిసి పలు అంశాలపై వారు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి వినతిపత్రాన్ని అందించారని తెలిపారు. టీచర్లకు సంబంధించి న్యాయమైన సమస్యల పరిష్కార విషయంలో అండగా ఉంటామని హామీ ఇచ్చారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.