YouTubers Association
YouTubers Association

YouTubers Association: నిర్మల్ జిల్లా యూట్యూబర్స్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక

YouTubers Association: నిర్మల్, డిసెంబర్ 29 (మన బలగం): నిర్మల్ జిల్లా యూట్యూబర్స్ న్యూస్ చానల్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోల సంఘ భవనంలో నిర్వహించి, ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా రషీద్ ఆలం (తహెల్క న్యూస్ -7), జిల్లా అధ్యక్షులుగా మహమ్మద్ ఉస్మాన్ (హెచ్ బి 6 న్యూస్), ఉపాధ్యక్షులు-1గా కొత్తూరు శంకర్ (బి ఎన్ ఎస్ న్యూస్), ఉపాధ్యక్షులు-2గా భీమేశ్, ప్రధాన కార్యదర్శిగా గైని భోజన్న (జనం వెలుగు న్యూస్), సంయుక్త కార్యదర్శిగా సీహెచ్ నర్సయ్య, (డీఎస్ఆర్ న్యూస్), కోశాధికారిగా టీ.మధుకర్ (ఎస్ఎన్ 1 న్యూస్), గౌరవ సభ్యులు-1 డి.శ్రీనివాస్ గౌరవ సభ్యులు-2 వి.కృష్ణ, సలహాదారులుగా మహమ్మద్ ఇసాక్ అలీ, డి.లింగం రాజులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక, నిర్ణయాలు తీర్మానాలపై చర్చించుకోవడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *