BC Reservations Protest Indira Park Hyderabad
BC Reservations Protest Indira Park Hyderabad

BC Reservations Protest Indira Park Hyderabad: బీసీల సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయండి

BC Reservations Protest Indira Park Hyderabad: నిర్మల్, ఆగస్టు 20 (మన బలగం): బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 25న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య చేపట్టనున్న బీసీల సత్య గ్రహ దీక్షను విజయవంతం చేయాలని బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ కోడూరి చంద్రయ్య పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ వద్ద మాట్లాడారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముందుకు వెళ్లాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఘర్షణ పద్ధతిలో కాకుండా ప్రత్యామ్నాయ పద్ధతి ఆలోచించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చించి రిజర్వేషన్లు అమలయ్యే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే అధికార కాంగ్రెస్ పార్టీకి బీసీలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. జిల్లా నుంచి పెద్ద ఎత్తున బీసీలందరూ.. సత్యాగ్రహ దీక్షకు కదిలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నవ సంఘర్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు అప్క గజేందర్ యాదవ్, జిల్లా అధ్యక్షుడు ఫిరోజ్, అధికార ప్రతినిధి జుట్టు వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *