Calendar release: నిర్మల్, ఫిబ్రవరి 1 (మన బలగం): నిర్మల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ చేతుల మీదుగా తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నిర్మల్ జిల్లా క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ గెజిటెడ్ సెంట్రల్ అసోసియేషన్ డైరీని కలెక్టర్‌కు బహూకరించారు. ఈ సందర్భంగా కలెక్టరు అభిలాష అభినవ్ మాట్లాడుతూ ప్రభుత్వం చేసే అభివృద్ది కార్యక్రమాలలో గెజిటెడ్ అధికారుల కృషి ఎనలేనిది అన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఉద్యోగులు వారధి లాంటివారు అని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ టీజీవో అసోసియేషన్ నిర్మల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ పీజీరెడ్డి, జిల్లా సెక్రటరీ ధాత్రిక రమేశ్, అసోసియేటివ్ ప్రెసిడెంట్స్ ప్రవీణ్ కుమార్, సత్యపాల్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ గంగాధరయ్య, ప్రచార కార్యదర్శి విష్ణువర్ధన్, జాయింట్ సెక్రటరీలు మెరాజుద్దీన్, డాక్టర్ రాణి ఆఫీసు సెక్రటరీలు రాజమల్లు, క్రాంతి కుమార్ కల్చరల్ సెక్రెటరీ శ్రీనివాస్ గౌడ్, కార్యవర్గ సభ్యులు కిరణ్ కుమార్, కరుణశ్రీ, మధుకర్, శ్రీహరి, దేవొల్ల లత మరియు టీజీవో సంఘ నాయకులు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
