Minister Komati Reddy Venkat Reddy: తెలంగాణ బ్యూరో/ మన బలగం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శనివారం తన నివాసంలో ఆర్అండ్‌బీ ఛీప్ ఇంజినీర్లతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్ర మాట్లాడుతూ అటవీ అనుమతులతో పెండింగ్‌లో ఉన్న రహదారులు పూర్తి చేసేలా ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. రహదారి, భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని సూచించారు. పనుల్లో వేగం పెంచి ప్రగతి చూపిస్తేనే, మరిన్ని నిధులు సాధించే అవకాశం ఉంటుందని అధికారాలకు మంత్రి దిశానిర్దేశం చేశారు. పెండింగ్ సీఆర్ఐఎఫ్, స్టేట్ రోడ్స్, రైల్వే బ్రిడ్జ్, బిల్డింగ్స్, ఇతర ప్రాజెక్ట్స్‌పై సమీక్ష నిర్వహించారు. బడ్జెట్ నేపథ్యంలో అత్యవసరమున్న రహదారులపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని అధికారులను ఆదేశించారు. రివ్యూ సమావేశంలో తిరుమల సీఈ (అడ్మినిస్ట్రేషన్), జయభారతి, సీఈ (లెఫ్ట్ వింగ్ ఏరియాస్) రాజేశ్వర్ రెడ్డి సీఈ (బిల్డింగ్స్, సీఆర్ఐఎఫ్) పుల్లాదాస్ సీఈ (క్వాలిటీ కంట్రోల్), శ్యాం కుమర్, సీఈ (రూరల్ రోడ్స్) పాల్గొన్నారు.