Gulf Bathukamma celebrations Siddilakunt: నిర్మల్ జిల్లా సిద్దిలకుంట లో తెలంగాణ రాష్ట్ర గల్ఫ్ కాంగ్రేస్ టీపీసీసీ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో బుధవారం శివాలయం వద్ద గల్ఫ్ వలస కార్మిక కుటుంబ సభ్యులు బతుకమ్మ ఆడారు. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలు వెళ్లిన తమ అన్నదమ్ములు, బంధు మిత్రులు క్షేమంగా ఉండాలని, సంతోషంగా ఇంటికి తిరిగి రావాలని పాటల రూపంలో ఆ గౌరమ్మను వేడుకున్నారు. కాంగ్రేస్ ప్రభుత్వం తెలంగాణ గల్ఫ్ కార్మికుల కోసం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న క్రమంలో తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వయిజరీ కమిటీ మెంబెర్ స్వదేశ్ పరికిపండ్ల పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించారు. గల్ఫ్ ఎడారి కార్మికులకు, బతుకమ్మ లాంటి భరోసా ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి, గల్ఫ్ బాధితులను, భాగ్యవంతులుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్న కాంగ్రేస్ ప్రభుత్వానికి కృతఙ్ఞతగా ‘గల్ఫ్ బతుకమ్మ’ వేడుకలను నిర్వహిస్తున్నామని సోన్ కాంగ్రెస్ నాయకురాలు రేఖా ప్రసాద్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ పట్టణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షులు వాసవి నాయకులు శశిమాల, కొమ్ము గీత, సురేఖ, అనిత గ్రామ మహిళలు పాల్గొన్నారు.