Demand for arrest of Siddipet advocates over caste remarks: తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట్ అడ్వకేట్స్ ను తక్షణమే అరెస్టు చేయాలని ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ అడ్వకేట్స్ ఫోరం నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రత్నం బుధవారం ప్రకటనలో డిమాండ్ చేశారు.భారత అత్యున్నత న్యాయస్థానం, సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ బి.ఆర్ గవాయ్ పై కులపరమైన వ్యాఖ్యలు చేసిన ఇద్దరు సిద్దిపేట్ అడ్వకేట్స్ సభ్యత్వాన్ని తెలంగాణ బార్ కౌన్సిల్ రద్దు చేయాలన్నారు. అలాగే సిద్దిపేట్ బార్ కౌన్సిల్ సైతం వారు న్యాయవాద వృత్తిలో కొనసాగకుండా ..చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ ఇద్దరు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.లేదంటే ఎస్సీ ,ఎస్టీ న్యాయవాదులు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ అడ్వకేట్స్ చేసిన అవమానకర వ్యాఖ్యలతో మొత్తం తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ ల గౌరవం దేశంలో పోయిందన్నారు.
