Sharannavaratri special pujas in Khanapur: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని పాత ఎల్లాపూర్‌లో, పట్టణంలోని శ్రీరాంనగర్ భీమన్నా గల్లీలో శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బుధవారం దుర్గమాత మండపాల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అన్నపూర్ణ దేవి అమ్మవారిగా మూడో రోజు దర్శనం ఇచ్చారు. అర్చకులు ఆధ్వర్యంలో అభిషేకం, పారాయణం, మంత్రపుష్పం, అర్చనలు నిర్వహించారు. భవాని దీక్ష పరులు భజనలు చేస్తూ పాటలు పాడారు. ప్రతి రోజూ వివిధ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో పంబాల భీమేశ్వర్, వినోద్, మైలారపు శ్రీనివాస్, గడ్డి రమేశ్, ప్రమోద్ కుమార్, నాగరాజు, భీంరావ్, శ్యాం పాల్గొన్నారు.
