Women police celebrate Bathukamma in Khanapur: నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ఏఆర్ఎస్ కాలేజీలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నారీశక్తి ఖానాపూర్ పోలీస్ ఆధ్వర్యంలో బుధవారం బతుకమ్మ ఆడారు. డబ్ల్యూఎస్ఐ జ్యోతిమణి, నారీశక్తి డబ్యూపీసీ మల్లేశ్వరి, నర్మదా కాలేజీ విద్యార్థినులతో కలిసి ఉల్లాసంగా బతుకమ్మ ఆడారు. ఆట ఆడుతూ, పాటలు పాడుతూ అలరించారు. బతుకమ్మ క్రమశిక్షణకు నిదర్శనం అని, మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.