Rekhanayak
Rekhanayak

Rekhanayak: రేఖానాయక్‌కు ఆస్ర్టేలియాలో అరుదైన గౌరవం

Rekhanayak: తెలంగాణ మాజీ ఎమ్మెల్యే శ్రీమతి అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియా దేశంలోని విక్టోరియా రాష్ట్ర పార్లమెంటులో ఆ రాష్ట్ర మంత్రి నాటలి హచిన్స్ శాలువాతో సన్మానించారు. విక్టోరియా రాష్ట్ర పార్లమెంటులో ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ విక్టోరియా (ICAV) వారు భారతదేశ 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు.

ఈ వేడుకలకు గౌరవ అతిథిగా హాజరైన తెలంగాణ మాజీ ఎమ్మెల్యే శ్రీమతి అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్‌ను విక్టోరియా రాష్ట్ర ఉద్యోగాలు మరియు పరిశ్రమల శాఖ, మహిళ శాఖ, ట్రీటి అండ్ ఫస్ట్ పీపుల్స్ శాఖ మంత్రి నాటలి హచిన్స్ శాలువాతో సన్మానించారు. అనంతరం చాలా సంవత్సరాల నుంచి శ్రీమతి రేఖా నాయక్ చేస్తున్న ప్రజా సేవ‌ను ICAV ప్రశంశిస్తూ రాసిన ప్రశంసా పత్రాన్ని అందజేసారు. కార్యక్రమంలో విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ రాజ్ సైనీ, విక్టోరియన్ మల్టీకల్చరల్ కమిషన్ సలహాదారు రాజు వేముల, ఆస్ట్రేలియా లేబర్ పార్టీ నాయకుడు ప్రవీణ్, ICAV జనరల్ సెక్రేటరీ రాజ్ కుమార్ వడ్లకొండ, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *