Distribution of sound system to school: ఇబ్రహీంపట్నం, నవంబర్ 16 (మన బలగం): జగిత్యాల జిల్లా మెట్‌పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివిన ఎస్ఎస్సీ బ్యాచ్ 1979 పూర్వ విద్యార్థులు పాఠశాలకు శనివారం రూ.16 వేలు వెచ్చించి సౌండ్ సిస్టమ్ అందించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి పదో తరగతిలో 10 జీపీఏ సాధించిన ఉత్తమ విద్యార్థులకు రూ.1116 చొప్పున నగదు బహుమతి అందిస్తానని కోట గంగాధర్, వంగరి మధు వేర్వేరుగా ప్రకటించారు. 45 ఏండ్ల క్రితం తాము చదివిన తరగతి గదిలో కూర్చొని జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఏడీఈ మనోహర్, అనిల్, గంగాధర్, హేమచంద్ర రజీయొద్దీన్, రమణ, భూపాల్, రాజు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధు చందర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.