భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అరె రమేశ్
BJP Ibrahimpatnam: ఇబ్రహీంపట్నం, నవంబర్ 16 (మన బలగం): సన్నం వడ్లు పండించిన రైతులకు భరోసా కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఇబ్రహీంపట్నం మండల భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అరె రమేశ్ అన్నారు. మండలంలోని వేములకుర్తి గ్రామంలో శనివారం బీజేపీ నాయకులు కోనుగోలు కేంద్రాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సన్నం వడ్లు పండించిన రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్ అందజేస్తామని హమీ ఇచ్చిందని, ఇంత వరకు ఎలాంటి విధి విధానాలు తెలుపలేదన్నారు. ఎలాంటి ఆంక్షలు, తరుగు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ ఎడిపెల్లి శ్రీనివాస్, ఓబీసీ మండల అధ్యకుడు మాలెపు శ్రీనివాస్, శక్తికేంద్రం ఇన్‌చార్జి కోటగిరి వెంకటస్వామి, గుడ్ల నాగరాజు, రైతులు దేశెట్టి రవి, పందిరి పోశయ్య, రెడ్డవేన రాజన్న తదితరులు పాల్గొన్నారు.