MLC elections: కరీంనగర్, మన బలగం: సీపీఐ బలపరుస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపించేందుకు కమ్యూనిస్టు శ్రేణులు పనిచేయాలని సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో గురువారం కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన నరేందర్ రెడ్డి ట్యూషన్ టీచర్ నుంచి విద్యావ్యవస్థలను నెలకొల్పే స్థాయికి ఎదగాడంటే తన యొక్క ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లి ఈరోజు ఉత్తర తెలంగాణలోనే పేరు ప్రఖ్యాతలు సంపాదించాడని అన్నారు. నరేందర్ రెడ్డిని గెలిపిస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్ అమలుకై అహర్నిశలు పాటుపడతాడని పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్‌ల విడుదలకు కృషి చేస్తారని, న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకువచ్చేందుకు కృషి చేస్తారని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనకు ప్రభుత్వంతో మాట్లాడి నూతన నియామకాలకు ప్రయత్నించే వ్యక్తి అని వారు అన్నారు. నరేందర్ రెడ్డి గెలవడం ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పన కోసం పాటుపడతారని తెలిపారు. రాష్ట్ర రాజకీయాల్లో నూతన ఒరవడి సృష్టించడానికి, కుల మతాలకతీతంగా సబ్బండ వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని ఉద్యోగ అవకాశాల కేంద్రంగా తీర్చిదిద్దడం కోసం సమాజసేవకుడిగా అన్ని వేళల్లో అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కారం కృషి చేస్తాడని తెలిపారు. అందరికీ అందుబాటులో ఉండే నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎన్నికల్లో ఓట్లు అడుగుతున్న బీజేపీ పాలకులు దేశంలో ఖాళీగా ఉన్న కోట్ల ఉద్యోగాలను భర్తీ చేయడంలో పూర్తిగా విఫలం చెందారని, దేశంలో నిరుద్యోగ సమస్యను పెంచి పోషిస్తున్నారని, ఉత్తర తెలంగాణలో ట్రిపుల్ ఐటీ, ఐఐఎం, నవోదయ, సైనిక్ లాంటి విద్యాసంస్థలను తీసుకురావడంలో ఘోరంగా విఫలం చెందాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగ సమస్యలు పట్టించుకోని బీజేపీని ఓటు అనే ఆయుధంతో తరిమికొట్టాలని సురేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కరపత్రం విడుదల కార్యక్రమంలో సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజుగౌడ్, న్యాల పట్ల రాజుగౌడ్ నాయకులు నల్లగొండ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.