Jagityala SP
Jagityala SP

Jagityala SP: గణేశ్ నిమజ్జనానికి 580 మంది పోలీసులతో భద్రత.. జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్

Jagityala SP: జగిత్యాల జిల్లాలో నిర్వహించే గణేశ్ నిమజ్జన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశామని, ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. సోమవారం స్థానిక గార్డెన్‌లో పోలీస్ అధికారులకు, సిబ్బందికి గణేశ్ నిమజ్జనానికి సంబంధించిన భద్రతపరంగా తీసుకోవాల్సిన చర్యల గురించి బ్రీఫింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ నిమజ్జనోత్సవం సందర్భంగా ప్రజలు ఎక్కువగా వస్తారని, వారితో మర్యాదగా ప్రవర్తిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విధులు నిర్వహించాలని ఎస్పీ సూచించారు. నిమజ్జనోత్సవానికి భద్రతపరమైన ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా 580 మంది పోలీస్ అధికారులు, సిబ్బందిచే పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రశాంత నిమజ్జనానికి ప్రజలు సహకరించాలని కోరారు. పోలీస్ అధికారులు, సిబ్బంది బందోబస్తు కేటాయించిన ప్రాంతంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, డ్యూటీ గురించి పూర్తిగా తెలిసి ఉండాలని సూచించారు. డ్యూటీ ప్రదేశం నుంచి ఎవరు ఎట్టి పరిస్థితుల్లో కదిలి వెళ్లకూడదని ఆదేశించారు. డ్యూటీ పరంగా ఏదైనా సందేహం ఉంటే సంబంధిత అధికారులను అడిగి తెలుసుకోవాలని ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీలు రఘు చందర్, రవీంద్ర కుమార్, రంగారెడ్డి, ఇన్‌స్పెక్టర్లు ఆరిఫ్ అలీ ఖాన్, వేణుగోపాల్, రామ్ నర్సింహారెడ్డి, రవి, కృష్ణారెడ్డి, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ వేణు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *