Nirmal SP: నిర్మల్ జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించనున్న వినాయక నిమజ్జనం ప్రశాంతంగా పూర్తయ్యేందుకు అందరూ సహకరించాలని ఎస్పీ జానకి షర్మిల కోరారు. వినాయక శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాలకు ప్రజలు పూర్తిగా సహకరించాలని కోరారు. వదంతులను నమ్మవద్దని సూచించారు. శోభాయాత్ర జరిగే రూట్లను ఎస్పీ పరిశీలించారు. ఇరు మతాలవారు పరస్పరం ఒకరినొకరు గౌరవించుకొని ముందుకు సాగాలని కోరారు. స్థానిక గుల్జార్ మార్కెట్ ప్రాంతంలో శోభాయాత్ర వెళ్లే మార్గాన్ని 39వ వార్డు కౌన్సిలర్ తౌహీద్ ఉద్దీన్‌తో కలిసి పరిశీలించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. కావాల్సిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఎస్పీ వెంట డీఎస్పీ గంగారెడ్డి, పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ ఉన్నారు.