Subhash Patriji Jayanti: ఇబ్రహీంపట్నం, నవంబర్ 16 (మన బలగం): ధ్యానం, శాకాహారంతో సంపుర్ణ ఆరోగ్యం లభిస్తుందని పీఎస్‌సీ మాస్టర్లు శ్రీకాంత్, తిరుపతి, కిషన్ తెలిపారు. ధ్యాన గురూజీ సుభాష్ పత్రిజీ జయంతి ఉత్సవాలలో భాగంగా కార్తీక పౌర్ణమి ధ్యాన దీపోత్సవ సమావేశం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వేములకుర్తి గ్రామంలోని శ్రీ లక్ష్మీనర్సింహ స్వామి రైస్ మిల్లులో కొబ్బాజి లక్ష్మీనర్సయ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టర్లు ధ్యానం, శాకాహారం ద్వారా కలిగే లాభాలను వివరించారు. అనంతరం పిరమిడ్ ముందు దీపోత్సవ వేడుకలు జరిగాయి. అనంతరం అల్పాహారం అందచేశారు. కార్యక్రమంలో కోటగిరి అశోక్, పెంట లింబాద్రి, అరె రమేశ్, కుమ్మరిపెల్లి నర్సయ్య, బర్కం సత్యం, ధ్యానులు తదితరులు పాల్గొన్నారు.