China Manja: నిర్మల్, జనవరి 9 (మన బలగం): పర్యావరణానికి ప్రమాదం కలిగించే చైనా మాంజా వద్దని సారంగాపూర్ డిప్యూటీ రేంజర్ ఎండీ నజీర్ ఖాన్ అన్నారు. నిర్మల్ రేంజ్, సారంగాపూర్(డబ్ల్యూ) సెక్షన్, మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ‘చైనా మాంజాను నివారిద్దాం- పర్యావరణాన్ని పరిరక్షిద్దాం’ అను అంశంపై సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చైనా మాంజా వల్ల జరుగు దుష్పరిణామాలను, అవి పర్యావరణంపై చూపించే ప్రభావాన్ని విద్యార్థులకు వివరించి, ఎకో ఫ్రెండ్లీ పండుగ జరుపుకోవాలని సూచించారు. కార్యక్రమంలో విజయ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు, పాఠశాల సిబ్బంది, వెన్నెల, సుజాత, ఎఫ్‌బీవో, విద్యార్థులు పాల్గొన్నారు.
