RMP-PMP election: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 5 (మన బలగం): రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వీర్నపల్లి మండల కేంద్రంలో అర్ఎంపీ, పీఎంపీ నూతన మండల కార్యవర్గం ఎన్నికలు నిర్వహించారు. మండల అధ్యక్షులుగా భూక్యా సంతోష్ నాయక్, ప్రధాన కార్యదర్శి మనీపాల రవి, క్యాషియర్‌గా బొయిని నర్సయ్య, ఉపాధ్యక్షులుగా పసుల గంగరాజులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా భూక్యా సంతోష్ మాట్లాడుతూ ఆర్ఎంపీ, పీఎంపీలు గురుతర బాధ్యతను అప్పగించారని, ఎలాంటి అవరోధాలు ఎదురైనా ముందుటాని తెలిపారు. కార్యవర్గ సభ్యులుగా బంజార రాజేశం, గుమ్మడి రాజేశం, నక్క పర్శరాములు, గంగ మురళి, రాజు, సురేశ్, మహిపాల్, సుధీర్, ప్రకాశ్, దర్ సింగ్, కాషిం, మురళి దేవ దాస్, రాజేశం ఎన్నికయ్యారు.