Kumbh Mela: ప్రయాగ్‌రాజ్: భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గ్యాల్ వాంగ్‌చుక్ మంగళవారం ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో కొనసాగుతున్న కుంభమేళాలో పాల్గొని త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. మొదట ఇక్కడికి చేరుకున్న భూటాన్ రాజుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయనతో కలిసి త్రివేణి సంగమానికి చేరుకొని స్నానం ఆచరించారు. శ్రీ అక్షయవత్ జీని దర్శించి పూజలు చేశారు. అలాగే బడే హనుమాన్‌ను సందర్శించారు. అంతకుముందు ప్రయాగ్‌రాజ్‌లోని ఆధ్యాత్మికత మరియు ఆధునికత పవిత్రకు చిహ్నమైన మహాకుంభ్-2025, డిజిటల్ మహాకుంభ్ అనుభూతి కేంద్రాన్ని సందర్శించారు. మహాకుంభమేళా దైవిక, గొప్ప మరియు డిజిటల్ రూపాన్ని పరిశీలించారు.