Ram Setu Bridge: రామసేతు వివాదానికి మరో పరిష్కార మార్గం లభించింది. రామసేతు కల్పితమన్న వాదనను కొట్టి పారేస్తూ తాజాగా వెల్లడైన ఆధారాలు రుజువు చేస్తున్నాయి. సేతు కల్పితం కాదని, నిజంగా ఉందని నిరూపితమైంది. భారత్, శ్రీలంకల మధ్య రామసేతు వంతెన కాల్పనికం కాదని, నిజమేనని భాతర అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో) తేల్చిచెప్పింది. అమెరికాకు చెందిన ఐస్‌శాట్2 డేటాను వినియోగించి తమిళనాడులోని ఈ వంతెనకు సంబంధించి మ్యాప్‌ను ఇస్రో శాస్ర్తవేత్తలు తాజాగా విడుదల చేశారు. భారత్, శ్రీలంక మధ్య ఉండే ఈ వంతెన పొడవు 29 కిలో మీటర్లు అని, ఎత్తు సముద్ర గర్భం నుంచి 8 మీటర్లు అని తేల్చి చెప్పారు. ఈ వంతెన తమిళనాడులోని రామేశ్వరం ద్వీపం ఆగ్నేయ దిశలోని ధనుష్కోటి నుంచి శ్రీలంక మన్నారు ద్వీపంలోని తలైమన్నార్ వాయువ్య దిక్కు వరకు విస్తరించి ఉందని నిర్ధారించారు. వంతెనను సున్నపురాతితో నిర్మించినట్టు గుర్తించారు. ప్రస్తుతం రామసేతు 99.98 శాతంలో నీటిలో మునిగి ఉందని శాస్ర్తవేత్తలు వెల్లడించారు.